Friday, March 13, 2026

రూ. 750 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రానన్ని నిధులతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రూ. 750 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో రూ. 1కోటి 75లక్షలతో నిర్మనిచనున్న సిసి రోడ్డు మరియు సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన అలాగే రూ. 20 లక్షల రూపాయలతో గౌడ సంఘం కమ్యూనిటీ హల్ భవనాన్ని కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పెద్దపెండ్యాల గ్రామం రాజకీయ చైతన్యం కలిగిన గ్రామం అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఐక్యతతో అభివృద్ధి సాధ్యమని తెలిపారు. పెద్దపెండ్యాల గ్రామానికి 15 ఏళ్ల క్రితం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన బీటి రోడ్లే నేటికి ఉన్నాయని గత ప్రభుత్వం, పాలకులు గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని అన్నారు. నాపై నమ్మకంతో నన్ను గెలిపించిన మీ అందరి ఋణం తీర్చుకునే విధంగా పని చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తులు నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతీ పనిని పూర్తి చేస్తానని దానికి మీ అందరి సహాయ సహకారాలు అవసరమని కోరారు. ఇప్పటికే పెద్దపెండ్యాల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు, త్వరలోనే మంజూరు వస్తుందని అన్నారు. జనవరి 26నుండి సంక్షేమ పథకాల జాతర మొదలవనుందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతులకు రైతు భరోసా, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించనున్నట్లు వెల్లడించారు. గత 10ఏళ్ళు బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఒక్క ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News