Friday, March 13, 2026

అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

  • చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

నేటి సాక్షి, మందమర్రి:- పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అధికారులకు సూచించారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, పెండింగ్ పనులు నెల రోజుల లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగు పరచవలచాలని సానిటరీ ఇన్స్పెక్టర్ శ్యాం సుందర్ కు సూచించారు. నూతనంగా నియామకమైన 16 మంది వార్డు ఆఫీసర్లను, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంటెంట్ లు విధి నిర్వహణలో పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నులిగొండ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం సుమతి, మున్సిపల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ సందీప్, రెవిన్యూ ఆఫీసర్ పి కృష్ణ ప్రసాద్, అదికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News