నేటి సాక్షి, జమ్మికుంట:
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో గల వైకుంఠధామానికి 50 లక్షల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించిన జమ్మికుంట మున్సిపల్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు రావుసందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాలకవర్గం ఏర్పడినప్పటి నుండి సిసి రోడ్లు డ్రైనేజీలు మురికి కాలువలు శ్మశానవాటికలు అన్ని రకాలుగ అభివృద్ది చేశామని వారు తెలిపారు. అంతేకాకుండా ప్రతి వార్డులో తమ కౌన్సిలర్లు అందరూ నాడు-నేడు అనే విధంగా ప్రతి ఒక్కరూ తమ వార్డుల అభివృద్దికి ఎంతగానో కృషీ చేశారని వారు తెలిపారు.

అనాథ శవాలు గాని, సొంత ఇల్లు లేని వారు గాని, వారి కార్యక్రమాలు పూర్తి అయ్యే వరకు ఇక్కడే అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. అదే విధంగా ప్రైవేటుపరమైన ఈ యొక్క స్మశాన వాటికను మున్సిపల్ వారికి అప్పగించిన డాక్టర్ రాజేశ్వరయ్య, చందా విశ్వనాథం, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎండీ ఆయాజ్, స్థానిక కౌన్సిలర్ భోగం సుగుణ, కౌన్సిలర్లు దయ్యాల శ్రీనివాస్, గాజుల భాస్కర్, బచ్చు శివశంకర్, దిడ్డి రాము, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

