Thursday, April 2, 2026

హుజురాబాద్ పాటి మీద ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల విరాళం

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన పాటి మీద ఆంజనేయస్వామి వారి ఆలయానికి భక్తులు భక్తిశ్రద్ధలతో విరాళాలు అందిస్తున్నారు. తాజాగా ముసుకు సుష్మిత – శ్రీకాంత్ రెడ్డి ( ఎన్ఆర్ఐ ) దంపతులు రూ. 20,000 విలువైన దీపపు చెమ్మలను స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, విరాళం అందించిన కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారాలు దేవస్థానం అభివృద్ధికి తోడ్పడతాయని, మరింత మంది భక్తులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మెన్ గందె శ్రీనివాస్, ఐదో వార్డ్ తాజా మాజీకౌన్సిలర్ అపరాధ ముత్యం రాజు, ఆలయ అర్చకులు తిరుమలయ్య, ప్రదీప్  పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News