Tuesday, March 31, 2026

రాజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ) : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రావడంతో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చిన భక్తులు తొలుత ధర్మ గుండంలో పవిత్రస్నానాలు ఆచరించారు. అనంతరం ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం, కోడెమొక్కు క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News