Monday, March 23, 2026

భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి

  • మంచిర్యాల డిసిసి ఏ భాస్కర్ ఐపిఎస్
  • వేలాల జాతర ఏర్పాట్ల పరిశీలించిన డిసిపి

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లాలోని జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26 నుండి 28 వరకు జరగనున్న వేలాల జాతరలో ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్ సూచించారు. శనివారం ఆయన పోలీస్ అధికారులతో కలిసి, వేలాల గుట్ట పైన, వేలాల గ్రామంలో గల ఆలయాలను, తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతరలో ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా రోడ్డు మరమ్మతులు చేయించాలని సూచించారు. జాతర సమయంలో ట్రాఫిక్ సమస్య రాకుండా, జాతరకు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, దేవుని దర్శనం చేసుకుని, వారు క్షేమంగా గమ్యస్థానాలకు చేరే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా వేలాల గుట్ట పైన, వేలాల గ్రామంలో గల ఆలయాలను, గోదావరిలో స్నాన ప్రదేశాలను, పార్కింగ్ ప్రదేశాలను సందర్శించి, అధికారులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ సిఐ వేణుచందర్, జైపూర్ ఎస్ఐ శ్రీధర్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News