నేటి సాక్షి, సైదాపూర్ : సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అభయాంజనేయ స్వామి ఆలయంలో భక్తజనం పోటెత్తారు. ప్రతి మంగళవారం, శనివారం అత్యధికంగా భక్తులు రావడంతో గుడి చుట్టూ పండుగ వాతావరణం నెలకొంది. కొంపెల్లి మణెమ్మ రాజిరెడ్డి నూతనంగా తీసుకున్న టు వీలర్ బండికీ పూజ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ దోనపాటి రామ్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ఆలయానికి అధికంగా భక్తులు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తూ, అభయమిచ్చే అభయాంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోరిన కోరికలు తీర్చాలని కోరారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే భక్తులకు తెలియజేస్తూ అన్ని రకాల వాహన పూజలు చేయబడునని తెలిపారు. హనుమాన్ మాల వేసుకునేవారు ఎవరైనా ఉంటే వారు ఆలయంలో అర్చకులు అందుబాటులో ఉంటారని, ఆలయంలో సకల సౌకర్యాలు కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.





