నేటిసాక్షి, ఆళ్లగడ్డ ప్రతినిధి:
ఆళ్లగడ్డ మండలం గూబగుండం గ్రామంలో బుధవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పారవేట పల్లకికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. చింతకుంట గ్రామం నుండి గూబగుండం గ్రామానికి విచ్చేసిన శ్రీ స్వామివారి పారువేట పల్లకికి గ్రామ పెద్దలు, భక్తులు వేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. స్ధానిక మట్టా వారి వీధిలో సాయంత్రం పారువేట పల్లకికి ఉత్సవ తెలుపు దారులు పూజలు నిర్వహించారు.





