- భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
- బ్రహ్మోత్సవాల వచ్చే భక్తులకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : ధర్మపురి లో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఈనెల 10వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరుగు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఆలయ పరిసరాల్లో కోనేరు ,క్యూలైన్లలో, వాహనాల రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రత ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.భక్తుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు ఎస్పీ వెంట డిఎస్పి రఘు చందర్, సి.ఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్.ఐలు ఉదయ్ కుమార్, ఉమసాగర్ ఉన్నారు.



