నేటి సాక్షి, బెజ్జంకి:
హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటీయు ఆధ్వర్యంలో భారీగా కార్మికులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి సిపిఎం నాయకుడు తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ హామలిలందరికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. కార్మికుల కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, పాత పెండింగ్ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, తక్షణమే ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు తీరే వరకు తమ ఆందోళన ఆగదని కార్మికులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

