Tuesday, March 24, 2026

చేర్యాల తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

  • భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటూ ఆందోళన

నేటి సాక్షి చేర్యాల: చేర్యాల మండలం ఆకునూరు శివారులో గల వ్యవసాయ భూమికి సంబంధించి చేర్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ. తన తాత నుండి తనకు సంక్రమించాల్సిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆరోపిస్తూ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మరాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక చేర్యాల తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు తాసిల్దార్ కార్యాలయానికి చేరుకొని ధర్నాను విరివింపజేసి రిజిస్ట్రేషన్ అయ్యేంతవరకు కార్యాలయం వద్దె ఉన్నారు.తమ తాత మాజీ మంత్రి నిమ్మ రాజారెడ్డి ఆకునూరు గ్రామంలో 1979 సంవత్సరంలో కొనుగోలు చేసిన భూమిని తమ తాత రాజారెడ్డి రాసిన విలునామా ప్రకారం తమ వాటకు రావలసిన భూమి 8 ఎకరాల 34 గుంటలు తమ బాబాయ్ నిమ్మ ప్రభాకర్ రెడ్డి పేరుతో పట్టగల భూమి 17.29( 17 ఎకరాల 29 గుంటల) ఎకరాల భూమిలో తనకు రావలసిన సగం భూమిని అనగా 8 ఎకరాల 34 గుంటల భూమిని తనకు కాకుండా మొత్తం భూమిని బాబాయి తన మామ మోహన్ రెడ్డి పేర రిజిస్ట్రేషన్ చేశాడని ఈ విషయంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హస్తం ఉందని అన్నారు. కోర్టులో కేసు ఉండగా, అట్టి భూమి మా తండ్రి రాజారెడ్డి గారు కొనుగోలు చేసారని ప్రభాకర్ రెడ్డి కోర్టులో అడ్మిట్ అయినటువంటి భూమిని అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ చేయించారని ఇలాంటి సంస్కృతి చేర్యాలలో ఎన్నడూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తాత రాసిన వీలునామా, కుటుంబ సభ్యుల సంతకాలతో అన్ని కాగితాలు ఉన్నప్పటికీ కేవలం తన పేరున పట్టా ఉందని తమకు అన్యాయం చేసి అమ్మాడని ఇలాంటి అన్యాయానికి మద్దతు పలకడం సరికాదని అన్నారు. ఈ విషయమై ఉన్న కాగితాలన్నింటిని తాసిల్దార్ కు చూపగా తమకు కోర్టు నుండి ఎలాంటి డైరెక్షన్ లేదని కాగితాల ప్రకారం సగం భూమి రావాల్సి ఉన్నా తాము రిజిస్ట్రేషన్ ఆపలేమని అన్నారని తెలిపారు. సిపిఎం సిద్దిపేట కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ… ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇరు వర్గాలను కూర్చోబెట్టి న్యాయం చేయాలి తప్ప ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వ్యవహార శైలి భూమి విషయంలో సరిగా లేదని గతంలో ఇటువంటి సంఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నాయని అన్నారు. తమకు కాంగ్రెస్ పార్టీ అంటే ద్వేషం లేదని కేవలం ఇటువంటి కార్యక్రమాలకు వత్తాసు పలుకుతున్న ప్రతాప్ రెడ్డి వైఖరి విషయంలోనే ఉందని అన్నారు. ఇప్పటికైనా ఇరు వర్గాలతో మాట్లాడి న్యాయం దిశగా వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్, మాజీ వైస్ ఎంపీపి నవీన్ రెడ్డి,ముస్త్యాల బాల నర్సయ్య,వెంకట్ మహో,మాజీ కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీష్ గౌడ్, పచ్చిమడ్ల సిద్ధులు గౌడ్,ముస్త్యాల నాగేశ్వరరావు, అందె బీరయ్య, బండకింది అరుణ్ గౌడ్,శివగారి అంజయ్య, అవుశేర్ల కిషోర్, ముస్త్యాల ప్రభాకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News