


నేటిసాక్షి బ్యూరో, నిజామాబాద్ (టి ఎన్ రమేష్):
తెలంగాణా ప్రభుత్వం విద్యాశాఖ పై ప్రత్యేక చొరవచ్చుపుతూ, పలు అంశాలపై ఆదేశాలు జారీచేసింది. ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో ఉండటంతో, ఆ శాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా గురుకులాల్లో, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మరియు మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచటం తో పాటుగా, విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు 14 డిసెంబర్ 2024 రోజునుండి తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఫుడ్ మెనులో మార్పు చేయటం జరిగింది. కేజీ టు పీజీ వరకు ప్రతి విద్యార్థిని,విద్యార్థులకు నాణ్యమైన,రుచికరమైన పౌష్టిక ఆహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్ సై అనటంతో, సామాన్యులు అంతా ప్రజా ప్రభుత్వాన్ని కొనియాడారు. కేవలం మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచటమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో మెగుగైన విద్యను బోధించాలని, అధ్యాపకులు సమయపాలన పాటిస్తూ, వారి వారి సబ్జాక్టులలో 100% రిజల్ట్ తీసుకు రావాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీంతో తెలంగాణా రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ కృష్ణఆదిత్య పూర్తిస్థాయిలో రిజల్ట్స్ తెచ్చేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీ ఐ ఈ ఓ లతో సమావేశమై 90 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దినిములంగా, జిల్లాస్థాయి అధికారుల నిరంతర పర్యవేక్షణ, వివిధ ప్రభుత్వ,ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు, కళాశాలల ప్రిన్సిపల్స్ అనునిత్యం డీ ఐ ఈ ఓ ల పర్యవేక్షణలో ఉత్తమ ఉత్తీర్ణత కొరకు పాటుపడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో కార్యాలయాలకె పరిమితమైన అధికారులు
ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా, ప్రతిరోజూ ప్రణాళిక ప్రకారం, రూట్ మ్యాప్ ను అనుసరిస్తూ,
రోజు సుమారు ఎనిమిది ప్రభుత్వ,ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలలను ఆకస్మిక తనిఖీలు చేస్తూ, కళాశాలల ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ కు సలహాలు,సూచనలు చేస్తున్నారు.
జిల్లాలలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్ తో నిరంతరం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కళాశాలల విద్యార్థిని, విద్యార్థుల హాజరుశాతం, విద్యార్థిని, విద్యార్థుల అభ్యాసం తీరును ప్రశ్నించి తెలుసుకుంటున్నారు.
జిల్లాలలోని డీ ఐ ఈ ఓ లు ప్రెస్ రిలీజ్ పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి దాని ద్వారా వారియొక్క కళాశాలల తనిఖీలు, ప్రిన్సిపాల్ లు, లెక్చరర్స్ తో, విద్యార్థులతో సమావేశమైన అంశాలను వాట్సాప్ గ్రూప్ ద్వారా పై అధికారులకు, మీడియాకు నిరంతరం తెలియజేస్తున్నారు.
విద్యశాఖ లోని ఈ మార్పు ఇలాగే కొనసాగాలని, విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

