- విల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్) : ప్రయాస్ ఇండియా చారిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ లెవెల్ వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కప్పును బహూకరించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆత్మవిశ్వాసానికి అంగవైకల్యం అడ్డు రాదని సాధించాలనే పట్టుదల ఉంటే ఎంతటి వారైనా పటా పంచలు అయిపోతారని సబిత ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.





