Friday, April 3, 2026

22 నుండి 25 వరకు కాలభైరవ స్వామి హోమాలు

నేటి సాక్షి – మేడ్చల్ జిల్లా ప్రతినిధి : ఉప్పల్ బాగయత్ లో స్వయంభుగా వెలసిన కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక కాలభైరవ స్వామి హోమాలు నిర్వహిస్తామని ఆలయ పూజారి రామకృష్ణ పంతులు కన్నయ్య పంతులు తెలిపారు. కాలభైరవ మూలమంత్ర అవహనం తోట బాలకృష్ణ ఉషారాణి పంతుల ఆధ్వర్యంలో కాలభైరవయోగిని ఘనత సమేత కాలభైరవ మూల మంత్ర ఆవహనము యోగినీలకు ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించబడును. మధ్యాహ్నము ప్రసాద వితరణ ఆలయ ప్రాంగణంలో జరుగును. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీర్వాదాలు అందుకుని మనుస్సు లో ఉన్న కోరికలు కాని పనులను స్వామివారికి మొక్కుకున్నచో ఈ హోమల ద్వారా నెరవేరుతాయని అన్నారు. ఈనెల 29వ తేదీన అమావాస్య సందర్భంగా అమావాస్యకు జరిగినట్లుగానే పూజలు జరుగుతాయని భక్తులు గమనించి హోమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News