నేటిసాక్షి, నిజామాబాద్ బ్యూరో, టి.ఎన్ రమేష్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లో, నార్ల శంకర్ S /o మల్లయ్య, వయసు: 40 సం”రాలు కులము: యాదవ, వృత్తి: లేబర్ R/o. లింగారెడ్డిపేట్ గారు తన భార్యతో కలిసి గత 20 సంవత్సరాలుగా హైదరాబాదులో బ్రతుకుతున్నారు. గత నెల తన తల్లి నార్ల బాలవ్వ చనిపోవడంతో, తన సొంత గ్రామమైన లింగారెడ్డి బయటకు వచ్చి కొన్నాళ్లు ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత భార్య పని కొరకు మళ్ళీ హైదరాబాద్ వెళ్దాం అనగా, నీవు వెళ్ళు నేను వస్తానని చెప్పి అతను ఏ పని చేయకుండా, లింగారెడ్డిపేటలోని ఇంటి వద్దనే ఉంటున్నాడు. తేదీ 12.02.2025 నాడు సాయంత్రం సుమారు 6 గంటలకు ఫోన్ చేసి తన భార్యను కూడా లింగారెడ్డిపేటకి రమ్మని చెప్పినాడు. భార్య నేను రాను ఇక్కడే పని చేసుకుంటాను, నువ్వు కూడా ఇక్కడికే రా అని చెప్పగా, వినకుండా నువ్వు ఇంటికి రాకపోతే పంచాయతీ పెడతానని బెదిరించినాడు. తన భార్య నీవు ఇక్కడికి రాకపోతే పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ చేస్తానని చెప్పింది. అప్పటినుండి శంకర్ ఇంటి నుండి వెళ్లిపోయినాడు. చుట్టుప్రక్కల ఏక్కడ వెతికిన అతని ఆచూకీ దొరకలేదు అని సమాచారం.





