Monday, April 13, 2026

కాంట్రాక్ట్ కార్మికులపై కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలి

  • హౌస్ డిస్మెంటలింగ్ కార్మికులకు కనీస వేతనాలు, బోనస్ అమలు చేయాలి
  • సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పి ఓసిపి లో పనిచేస్తున్న హౌస్ డిస్మెంటలింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు బోనస్, సిఎంపిఎఫ్ అమలు చేయాలని శ్రీరాంపూర్ ఏరియా జిఎం కు వినతిపత్రం అందజేస్తే, కార్మికులపై కక్ష్య సాధింపు చర్యతో సదరు కాంట్రాక్టర్ కార్మికుల విధులను ఆపివేయడం దుర్మార్గమైన చర్య అని, దీనిని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ తెలిపారు. శనివారం శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికులకు టెండర్ ప్రకారంగా రావాల్సిన కనీస అన్ స్కిల్డ్ వేతనం 526 రూపాయలను బోనస్ కలిపి ఇవ్వాల్సిన కాంట్రాక్టర్ కేవలం 440 రూపాయలు మాత్రమే కార్మికులకు చెల్లిస్తున్నారని ఆరోపించారు. దీనిపై అనేక దఫాలుగా అధికారులకు వినతిపత్రలు ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా మార్చి 8న శ్రీరాంపూర్ ఏరియా జిఎం కు వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. దీంతో సదరు కాంట్రాక్టర్ కార్మికులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతూ, కార్మికులందరి విధులను నిలిపివేయడం జరిగిందని ఆరోపించారు. కాంట్రాక్ట్ కార్మికులకు టెండర్ ప్రకారంగా రావాల్సిన కనీస వేతనం ఇవ్వకపోగా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడటం సమంజసం కాదని తెలిపారు. దీనిపై సింగరేణి అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకొని, బెదిరింపులకు పాల్పడుతూ, కార్మికులను విధులకు తీసుకోకుండా, కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఫిరోజ్ ఖాన్, ప్రేమ్ కుమార్, గిరీష్, తేజ, సంపత్, టి వినోద్, పి వినోద్, వంశీ, సాయి, వెంకటేష్, సంతోష్, ప్రశాంత్, కార్తీక్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News