నేటి సాక్షి ప్రతినిధి, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని దాచారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కొసం లింగాపూర్ కు సంబధించిన గ్రీన్ కో ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా సామాగ్రిని, సీసీ కెమెరాలను ఫౌండేషన్ సభ్యులు గణేష్ , సాంబా రెడ్డి, అజిత్, సంజీవరెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాణకి అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ.. విద్యార్థులకు శారీరక మానసిక ఉల్లాసం, పాఠశాల భద్రత కొసం సీసీ కెమెరాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి, శ్రీను, దావీదు,శ్రీనివాస్,సురేష్, సంజీవ్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.





