- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా 27 : వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో అత్యవసర వైద్య సేవలు పొందిన పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ 41చెక్కులను 11,27,000 /-రూపాయలను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.చిన్నారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం పొందలేని నిరుపేదలను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషితో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారులకు సహకారం అందజేయడం జరుగుతుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను గుర్తించి సంక్షేమానికి కృషి చేస్తుందని వనపర్తి నియోజకవర్గం లో పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్నామని పేర్కొన్నారు.సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి కి, జిల్లెల చిన్నారెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు కమర్ మియా, వనపర్తి జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కోట్ల రవి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సమద్ మియా, వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాముల యాదవ్, వనపర్తి పట్టణ మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బి. కృష్ణ, పెబ్బేర్ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు గౌని బుచ్చారెడ్డి,వనపర్తి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యాదవ్, సేవాదళ్ మహిళా అధ్యక్షురాలు జయమ్మ, యూత్ కాంగ్రెస్ నాయకులు లాయర్ బాబా, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సి .పెంటన్న యాదవ్, గోపాల్ పేట్ అధ్యక్షుడు గణేష్ గౌడ్, శ్రీరంగాపూర్ మండల అధ్యక్షుడు రాములు యాదవ్,వనపర్తి పట్టణ అధ్యక్షుడు నారాయణ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగి వేణు, చీర్ల జనార్ధన్, కోళ్ల వెంకటేష్, వెంకటేశ్వర్ రెడ్డి, నాగార్జున,అబ్దుల్లా, వెంకటేష్. రాము, జానంపేట నాగరాజు, మన్యం, ఆసిఫ్ మియా,పెద్దమందడి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.





