నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) రామచంద్రపురం : తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాసే 350 మంది విద్యార్థులకు స్థానిక శాసనసభ్యులు పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని) తన సొంత నిధులతో కొనుగోలు చేసిన ప్యాడ్లు,పెన్నులు, పెన్సిల్, స్కేల్ పరీక్షా సామాగ్రి ని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సోమవారం మండల పార్టీ అధ్యక్షుడు ఎం తిరుమలరెడ్డి, మాజీ ఎంపీపీ డి బిందు మాధవి, చేకూరి జనార్దన్ చౌదరి, స్థానిక టిడిపి నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు ఎం తిరుమలరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల లో చదివే విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎమ్మెల్యే పులివర్తి నాని అహర్నిషులకు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి విద్యార్థి పదవ తరగతి పరీక్షలు బాగా వ్రాసి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేకూరి వెంకట ప్రసాద్, కోరా హరిప్రసాద్, మాజీ వైస్ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, లెక్కల సురేంద్ర నాయుడు, పంతుల వెంకటేష్ నాయుడు, ఆకా దేవరాజులు, బండి విజయ్ కుమార్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.




