Monday, March 30, 2026

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

  • యూత్ కాంగ్రెస్ నాయకుడు – షేక్ పాషా

నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : మునగాల మండల కేంద్రంలో గల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాసే విద్యార్థిని, విద్యార్థులకు శుక్రవారం బరకత్ గూడెం గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు షేక్ పాషా తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసి విద్యార్థులకు ఫ్యాడ్లు, పెన్నులు, పెన్సిల్ , స్కేల్స్ పరీక్ష సామాగ్రిని విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. మార్చి 21 నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నయి కావున విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేసినందుకు సంతోషంగా ఉందన్నారు. అలాగే విద్యార్థులు పదవ తరగతి పరీక్షలను బాగా వ్రాసి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి, కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటయ్య, సామేల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News