Wednesday, April 1, 2026

జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు పరీక్ష సమాగ్రి పంపిణి

నేటి సాక్షి, మందమర్రి:- ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సందెల మహిర పుట్టినరోజు సందర్భంగా బుధవారం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు పరీక్ష సమాగ్రి పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పట్టణ ఎస్సై రాజశేఖర్ హాజరై, విద్యార్థులకు పరీక్ష సమాగ్రి పంపిణి చేశారు. అనంతరం ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ సేవలు యువతకు ఆదర్శమని అన్నారు. పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని అన్నారు. విద్యార్థులు చెడు మార్గంలో పోకుండా ఉన్నత శిఖరానికి ఎదగాలని సూచించారు. సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్ మాట్లాడుతూ, ఇంతటి మహా కార్యక్రమానికి సహకరించిన సందెల మహీర కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభు దేవ్, పట్టణ అధ్యక్షుడు నంది పాటరాజు, మండల అధ్యక్షుడు సకినాల శంకర్, దాడి రాజు, ఎండీ జావిద్ పాషా, రవీందర్, నాగ రాజు, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News