Tuesday, March 31, 2026

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ

యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో

నేటి సాక్షి, జమ్మికుంట :

యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో జమ్మికుంట మండలం కొరపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నా విద్యార్థిని, విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, స్కెల్ మరియు విద్యార్థులకు ఉపయోగపడే పలు వస్తువులు అందజేశారు. ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ… చదువుతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని 10 వ తరగతి తోనే భవిష్యత్ కు తొలిమెట్టని అన్నారు. అదే విధంగా పదవ తరగతి లో 100% ఉత్తిర్ణత సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పదవ పరీక్షల్లో కరీంనగర్ జిల్లాలోనే జమ్మికుంట మండలం అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. అదే విధంగా 10/10 సాధించిన విద్యార్థులకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించే విధంగా బహుమతులు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ తాళ్లపల్లి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బోయిని కుమార్, ఫిషరీష్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పింగిలి రాకేష్,యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గంగారపు మహేష్, పోల్సని సంతోష్ రావు, పొన్నం చంద్రమౌళి, దొగ్గల భాస్కర్, కళ్లేపల్లి జంపయ్య, గిరావేనా శ్రీనివాస్, కొండూ భిక్షపతి, పోల్సని సంపత్ రావు, యూత్ కాంగ్రెస్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు పాతకాల రమేష్, ములుపొజు కమలాకర్, అమృత శివ, పురేళ్ళ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News