- వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ

నేటి సాక్షి, వీణవంక: వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు తాండ్ర శ్రీహస్ జ్ఞాపకార్థం వారి తండ్రి లక్ష్మణ్ వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు 80 మందికి అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేసినారు.ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ మరియు చల్లూరు మాజీ ఎంపీటీసీ తాండ్ర శంకరులు మాట్లాడుతూ విద్యార్థిని,విద్యార్థులు చక్కగా చదువుకొని ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా ప్రయాణం సాగించి ఉన్నతమైన స్థానాలకు చేరుకొని కన్న తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు మంచి పేరు తేవాలని సమాజానికి ఉపయోగపడాలని కోరినారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రవీందర్, లెక్చరర్లు సిహెచ్ భాస్కర్, సుమలత, జైపాల్, అమ్మ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్,ముఖ్య సలహాదారుడు దరిపెల్లి మురళి, సభ్యులు దూలం సురేష్, బండారి సందీప్, వడ్లూరి హనుమంతు, కనుకుట్ల అంజయ్యలు పాల్గొన్నారు.




