Friday, March 13, 2026

విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ

  • అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి

నేటిసాక్షి, వీణవంక: వీణవంక మండలం, బొంతుపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు జున్నూతుల కౌసల్య గారి స్మారకార్థం వారి 4 వర్దంతిని పురస్కరించుకొని వారి భర్త జున్నూతుల నారాయణరెడ్డి, వారి కుమారుడు జున్నూతుల రాఘవరెడ్డి (PMCSO) ప్రధానమంత్రి ముఖ్య భద్రత అధికారి, ఘన్ముకుల మోడల్ స్కూల్ మరియు హై స్కూల్ లోని పదవ తరగతి చదువుతున్న 100 మంది విద్యార్థినీ, విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో జున్నూతుల నారాయణరెడ్డి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మోహిజ్ బేగ్, ఉపాధ్యాయులు కిషన్ దాస్, బాలయ్య ,అరుణ కిరణ్ హైస్కూల్ ఉపాధ్యాయులు శ్రీకాంత్, తిరుపతి, విజేందర్ రాజ్, చంద్రశేఖర్, అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి ముద్ధసాని శ్రీనివాస్, సభ్యులు బండారి అనిల్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News