- -పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా 169 చెక్కులు
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి (రాఘవుల శ్రీనివాసు): హుజురాబాద్ మండలం, పట్టణానికి చెందిన 169 లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులను హుజురాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలపై ఎమ్మెల్యే తన ధ్వనిని గట్టిగా వినిపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసపూరిత హామీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. మహాలక్ష్మి పథకం: మహిళలకు రూ. 2,500 అని చెప్పి, ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదు? రైతు రుణమాఫీ: ఆగస్టు 15 లోపు రూ. 2 లక్షల రుణమాఫీని ఏమైంది? రైతు భరోసా: ఎకరానికి రూ. 15,000 ఇచ్చే పథకం ఎక్కడ?కల్యాణలక్ష్మి తులం బంగారం: లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏమైంది? పింఛన్లు: పెద్దవారికి రూ. 4,000, వికలాంగులకు రూ. 6,000 పింఛన్ల హామీ ఏమైంది? ఉద్యోగాలు: రెండు లక్షల ఉద్యోగాల హామీ కేవలం వాగ్దానంగా మారింది.
ఇళ్ల నిర్మాణం: ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కట్టిస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో 54 విద్యార్థులు మరణించారని, 89 ఆటో డ్రైవర్లు, 29 చేనేత కార్మికులు, 450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 140 పైగా లైంగిక దాడి ఘటనలు జరిగాయని, 1085 మంది విద్యార్థులు ఆహార విషపూరితానికి గురై ఆస్పత్రిలో చేరిన ఘటనలు ఇలా తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాలకు కారకులు అయ్యారన్నారు. హుజురాబాద్ ప్రజల కోసం మేము ప్రశ్నిస్తూనే ఉంటామని, న్యాయం జరిగేవరకు మా పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ ఎడవల్లి కొండల్ రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్ మాజీ జెడ్పిటిసి బక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు.





