Sunday, March 29, 2026

ఇంటింటికి మహా కుంభమేళా జల ప్రసాదం పంపిణీ

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : మహాశివరాత్రి పర్వదినం రోజున ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా త్రివేణి సంగమం నుండి తీసుకువచ్చినటువంటి మహా జల ప్రసాదం ఒకరిద్దరికే అందివ్వకుండా అందరికీ అందించాలనే సంకల్పంతో బి బి కే (భీమ్ రాజు పల్లి బొమ్మన కుమార్) ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఫౌండర్ బొమ్మన కుమార్ భీమ్ రాజు పల్లి గ్రామంలో గురువారం ఇంటింటికి పంపిణీ చేశారు. గ్రామంలోని 160 కి పైగా కుటుంబాలకు ఈ పుణ్య నీటిని అందించడం జరిగింది. ఈ పుణ్యా నీటిని నెత్తిన చల్లుకున్న చాలు మహా కుంభమేళా పుణ్యస్నానం చేసినంత పుణ్యం.ఈ మహా పుణ్య నీరు ప్రతి గృహంలో ఉండటం చేత పూజా ఇతర శుభ కార్యక్రమాలకు ఎంతో ఉపయోగం. అందరికీ కుంభమేళా స్నాన పుణ్యం కలగాలని కాంక్షిస్తూ ఈ పుణ్య నీరు అందించడం తమ అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ సభ్యులు కంది మహేష్ సామల కిరణ్ అనగందుల రూపేష్ పవన్ తక్కల అశోక్ రేవల్లి గంగాధర్ బొమ్మన నరేందర్ పెద్దయ్య కంది అర్జున్ జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News