నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జెడ్పిహెచ్ఎస్ బాలుర ప్రాథమిక పాఠశాలలో యాభై ఐదు గురు పదవ తరగతి విద్యార్థులకు పెన్నులు,పరీక్ష అట్టలు శనివారం పంపిణీ చేశారు.ఈ సందర్బంగా లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సంవత్సరం బాలికల హైస్కూల్లో అట్టలు పెన్నులు మూడు రోజుల క్రితం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు పెన్నులు పరీక్ష అట్టలు లైన్స్ క్లబ్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని ఇవే కాకుండా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎండాకాలం, వానకాలం చలికాలంలో చెద్దర్లు పంపిణీ, అంబ్రెల్లా పంపిణీ కార్యక్రమం కంటి శిబిరాలు,గుండె సంబంధించిన చికిత్స శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్, సెక్రెటరీ గుండా రాకేష్,క్యాషియర్ నాంపల్లి వేణు గోపాల్, చర్లపల్లి అరుణ్ దీప్ గౌడ్, మర్రి భాస్కర్, మహాజన్ శివకుమార్, కటకం రాకేష్, ఇల్లెందుల వెంకటేశ్వర్లు, వేల్మల శ్రీనివాసరావు, హెచ్ఎం కె నారాయణ, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు.





