Tuesday, March 31, 2026

మోడల్ స్కూల్ విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ

నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ మండలంలోని ఇటిక్యాల మోడల్ స్కూల్లో ఆర్.బి. ఎస్ కే, జిల్లా అంధత్వ నివారణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈశిబిరంలో 17 మందికి వక్రీభవన సమస్య ఉందని నిర్ధారించి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కే డాక్టర్ రేవతి, డాక్టర్ నరేంద్ర, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్, పంచాయతీ కార్యదర్శి రాజేష్, ఏఎన్ఎం జ్యోతి, భాగ్య లక్ష్మి, వనిత, రజిత, ఫార్మసిస్ట్ గౌతమి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News