అదామా పెస్టిసైడ్స్ కంపెనీ వారి సౌజన్యంతో నిర్మాణ్ NGO సంస్థ
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ మండలములోని జడ్పిహెచ్ఎస్ సిర్సపల్లి పాఠశాలలో అదామా పెస్టిసైడ్స్ కంపెనీ వారి సౌజన్యంతో నిర్మాణ్ NGO సంస్థ ఆధ్వర్యంలో నాలుగు లక్షల రూపాయల విలువైన వస్తు సామాగ్రిలో భాగంగా విద్యార్థులు కూర్చోవడానికి 40 డ్యూయల్ డెస్క్ బేంచీలు, ఒకటి IFP స్మార్ట్ క్లాస్ ప్యానెల్ టీవీ, ఒక EPSON ప్రింటర్ మరియు కూర్చోవడానికి 5 ఎస్ టైప్ చైర్స్ వితరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాద్యాయులు విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ అదామా కంపెనీ వారు పాఠశాలకు ఇచ్చిన విలువైన సామాగ్రి విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా స్మార్ట్ క్లాసు ఆధారంగా మరింత మెరుగైన బోధన చేసి విద్యార్థుల శ్రేయోభివృద్ధికి పాటుపడదామని తెలుపుతూ వితరణ చేసిన అదామా కంపెనీ మరియు నిర్మాన్ సంస్థ ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలిపినారు. అదామా కంపెనీ ప్రతినిధి సౌత్ ఇండియా సేల్స్ మేనేజర్ పాపు నాయుడు మాట్లాడుతూ మా యొక్క సంస్థ రైతుల శ్రేయస్సే కాకుండా సమాజానికి ఇతోదికంగా సహాయపడే కార్యక్రమంలో భాగంగా విద్యాభివృద్ధి కొరకు ఇట్టి వితరణ చేయడం జరిగిందని తెలుపుతూ విద్యార్థులు ఈ సౌకర్యాలను ఉపయోగించుకుని మరింత మెరుగైన విద్యను స్మార్ట్ క్లాసెస్ ద్వారా నేర్చుకోవాలని సూచించారు.ఇట్టి కార్యక్రమానికి గ్రామ కార్యదర్శి సంపత్, పాఠశాల AAPC చైర్మన్ గంగా, PSHM రజిని, AEO సతీష్ రెడ్డి, ఎడవెల్లి కొండారెడ్డి PACS చైర్మన్, అదామా కంపెనీ నుండి ప్రతినిధులుగా పాపు నాయుడు, D. ప్రకాష్, తూముల చక్రధర్ రావు రైతు డిపో, మనోహర్, మరియు పాఠశాల శాశ్వతదాతలు గసిరెడ్డి సదాశివ రెడ్డి, వంగల వెంకట రెడ్డి, మరియు మాజీ ప్రజా ప్రతినిధులు ఎడ్ల విజయ్ కుమార్, తక్కల్లపల్లి వెంకట్రావు మరియు విద్యా అభిమానులు, గ్రామ ప్రముఖులు, రైతులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.





