మాజీ ఎంపీటీసీ కత్తి నర్సయ్య గౌడ్ టీ షర్ట్లు పంపిణి
నేటిసాక్షి, కోహెడ:
కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామ డప్పు కళాకారుల బృందం కు ప్రోత్సాహకంగా ఉండటానికి కత్తి నర్సయ్య గౌడ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి కళాకారులకు 16 మంది డప్పు కళాకారులకు టీ షర్టులను అందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా కళాకారులకు అండగా ఉంటామని వారి ఎదుగుదలకు తన వంతు కృషి చేస్తానని కళాకారులను గౌరవించడం మన యొక్క సంస్కృతిలో భాగమని, అంతరించిపోతున్న కళలని బ్రతికించుకోవడానికి అందరి ప్రోత్సాహం అవసరం అని, కళాకారుల గుర్తింపును మరియు బ్రతుకుతెరువును కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన మరియు ప్రజల పైన ఉందని తెలపడం జరిగింది. ప్రపంచంలో మొదటి మీడియా డప్పు అని, సాంకేతిక అభివృద్ధి లేని కాలంలో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేదని, ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో డప్పు కళాకారుల జీవన విధానం సమాజ శ్రేయస్సు కోసమై వారి కృషి అభినందించదగిందని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కోహెడ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పులి రాజు గౌడ్ పాల్గొన్నారు, అలాగే తంగళ్ళపల్లి డప్పు కళాకారుల బృందం అధ్యక్షుడు యాటెల్లి రాజమౌళి మరియు ఉపాధ్యక్షుడు చుక్క లింగయ్య, ఎర్రవల్లి పవన్, యాటెల్లి పోచయ్య కొంకటి బాబు మరియు కళాకారుల బృందం ధన్యవాదాలు తెలుపుకున్నారు.

