Sunday, March 8, 2026

పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేటలో జిల్లావ్యవసాయ అధికారి జొన్నలవాడి భాగ్యలక్ష్మి పంటలను పరిశీలించి రైతులకు సలహాలు సూచనలు తెలియజేశారు. వరిలో సమగ్ర ఎరువుల వాడకంలో కాంప్లెక్స్ ఎరువులు అయిన 20:20:0:13 లాంటి ఎరువులను వాడకూడదని దీనిలో 13 శాతం గంధకం వలన పంటపై సల్ఫైడ్ ఇంజురీ ప్రభావంతో దెబ్బతినడం జరుగుతుందని, రైతులు అధిక ధర వుందని పొటాష్ నీ వాడడం తగ్గించారని నాటు వేసిన 30 రోజులు లోపు పొటాష్ వేయాలని తెలియజేశారు. ఒకే వరి పంట పండించే పొలాల్లో రైతులు ప్రతి యాసంగిలో జింక్ సల్పేట్ ని ఎకరాకి 20 కిలోలు ప్రధాన మడిలో ఆఖరి దమ్ములో తప్పక వేయాలన్నారు. నాటువేసే ముందు నారు ఆకు కోనలు కత్తిరించి నాటలన్నారు. పంటల నమోదు పక్రియలో ఏఈఓ లు క్షేత్ర సందర్శన చేసినప్పుడు రైతులు సాగు చేసిన పంటలను సర్వే నెంబర్ల వారీగా వివరములు తెలియజేయాలన్నారు. దీని ఆధారంగానే కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమములో హుజురాబాద్ మండల వ్యవసాయ అధికారి చాడ భూంరెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారి పొద్దుటూరి సతీష్, రైతులు మూల చంద్రశేకర్ రెడ్డి, వంగల వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News