Thursday, April 2, 2026

ప్రాథమిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ):
గొల్లపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ని మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపి సేవలు, ఐపీ సేవలు రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్ ఐపీ రికార్డ్స్ మెడికల్ ఫార్మసి కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషంట్లని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు మెరుగు పరచాలని డాక్టర్లు సమయ పాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. రోజుకు ఎన్ని ఓ.పి.లను చూస్తున్నారు అని ఆరా తీశారు. ఆర్యోగ మహిళా కేంద్రంలో భాగంగా ప్రతి మంగవారం రోజున మహిళలకు ఉచితంగా అందించే 6 రకాల వైద్య పరీక్ష లను థైరాయిడ్ క్యాన్సర్ ఆస్తమా వంటి పరీక్షలు ఎలా చేస్తున్నారో ఎన్ని చేస్తున్నారు డాక్టర్లను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి ఆవరణలో ఉన్న పాత భవనాన్ని సందర్శించి పూర్తిస్థాయిలో శుభ్రపరచాలని ఆసుపత్రి ఆవరణలోని వున్న పిచ్చి మొక్కలను పూర్తిస్థాయిలో తొలగించాలని ఆదేశించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News