Wednesday, March 18, 2026

జాతీయ రహదారి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.

నేటి సాక్షి, మెట్ పల్లి:
జాతీయ రహదారి 63 పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు.మెట్ పల్లి ఆర్డిఓ కార్యాలయంలో రహదారి పనుల గురించి వ్యవసాయ భూములు,కోల్పోతున్న ఇల్లు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మెట్ పల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో గల రోడ్డు పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు.రహదారి నిర్మాణం కోసం చేస్తున్న భూ సేకరణ పనులను అధికారులు సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు.పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని,రోడ్డు నిర్మాణంలో రైతులు,ప్రజలు ఇబ్బంది పడకుండా చేపట్టాలని,రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు,నివాసం ఉన్న వారు ఏర్పాటు చేసుకున్న వసతులపై ప్రభుత్వం నష్టపరిహారం కింద చెల్లించాల్సిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.జాతీయరహదారి నిర్మాణంలో కోల్పోతున్న భూమి,ఇండ్లు,కట్టడాలు,చెట్లు,బోర్లు, పైపులైన్లు,ఇతర నిర్మాణాలను పరిశీలించి,వాటికి చెల్లించాల్సిన నష్ట పరిహారం అంచన విలువలను ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కలిసి చేయాలన్నారు.కలెక్టర్ వెంట ఆర్డీవో జివాకర్ రెడ్డి,శ్రీనివాస్,మేడిపల్లి ఎమ్మార్వో వసంత,సిబ్బంది సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News