Saturday, March 14, 2026

ప్రభుత్వ ఆసుపత్రి, ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ …. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష..

నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి);
సుల్తానాబాద్ ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న గైనిక్ రూమ్, జనరల్ వర్డ్, ఓపి రూమ్స్, ల్యాబ్ లను కలెక్టర్ పరిశీలించారు. టి- హబ్ కు ప్రతి రోజు ఎన్ని శాంపిల్స్ పంపుతున్నారు, ఫలితాలు ఎంత సేపటిలో వస్తున్నాయి వాటి వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు.ఓపి సమయాల్లో వైద్యులు ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే సిబ్బందికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అన్నారు. సుల్తానాబాద్ ఆసుపత్రి పరిధిలోని కొలనూరు, ఎలిగేడు, గర్రెపల్లి, జూలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కన్వర్జేన్స్ సమావేశాన్ని నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా అమలు చేయాలని, ఆసుపత్రి ప్రాంగణం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం మండలంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించి,జనవరి 26 నుంచి అమలయ్యే నూతన పథకాల లబ్ధిదారుల వివరాలు ఆన్ లైన్ ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు.ఆన్ లైన్ లో వివరాల నమోదు ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని అన్నారు.గ్రామ సభల ద్వారా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారించి అర్హత ఉంటే పథకాల లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రాథమిక జాబితాలో వచ్చిన అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని అన్నారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, సుల్తానాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News