- మెదక్ ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణాన్ని శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు

నేటి సాక్షి మెదక్ జిల్లా మెదక్(భూమయ్య) : ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణ పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిని అంచనా వేశారు. ఇంటి నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇందిరమ్మ మోడల్ హౌసింగ్ పథకం ద్వారా పేదలకు మంచి గృహాలు అందించడమే లక్ష్యమని తెలిపారు. పనుల్లో ఆలస్యం లేకుండా, నాణ్యతతో కూడిన నిర్మాణం జరగాలని అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పి.డి గృహ నిర్మాణ శాఖ మాణిక్యం, , ఈ.ఈ పి ఆర్ నరసింహులు, డి.ఈ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.





