
నేటి సాక్షి, కొడిమ్యాల :
ఫిబ్రవరి 08:శనివారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఆరోగ్యా ఉపకేంద్రంలోని చెప్యాల రామకృష్ణాపూర్ లో జరుగుతున్న చిన్నపిల్లల టీకాల కార్యక్రమాన్ని డిప్యూటీ డి. ఎం. హెచ్. ఓ. డాక్టర్ ఎన్. శ్రీనివాస్. ఆకస్మిక తనిఖీ చేశారు. డ్యూ లిస్టు తయారు చేసుకుని లిస్టులో ఉన్న పిల్లలందరికీ టీకాలు పడే విధంగా ఆశాలు అందరూ వెళ్లి పిల్లలను తీసుకొని వచ్చి టీకాలు వేయించాలని చెప్పారు. కేంద్రంలోని రికార్డులను రిజిస్టర్ లను పరిశీలించారు తర్వాత అక్కడి నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొడిమ్యాలకు వెళ్లి ఫార్మసీ ల్యాబ్ లేబర్ రూంలను పరిశీలించారు. ప్రజలకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ల్యాబ్ లో జరిపే అన్ని రకాల పరీక్షలను చేయించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని చెప్పారు. రిజిస్టర్లు రికార్డులను పరిశీలించి మెడిసిన్ ఎక్స్ పైరీ డేట్లు చూసుకొని మెడిసిన్ ఇవ్వాలి అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎం శ్రీనివాస్, మండల వైద్యాధికారిని డాక్టర్ ఈ. పరమేశ్వరి, డాక్టర్ సిహెచ్ నరేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వి రాజశేఖర్, హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్, అలివేలు పాల్గొన్నారు.





