నేటి సాక్షి చేర్యాల: తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికారసంస్థ హైదరాబాద్ మరియు సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్ పర్సన్, జిల్లా న్యాయసేవాధికారసంస్థ కె. సాయి రమాదేవి అదేశాల మేరకు ఎస్. స్వాతి రెడ్డి సెక్రెటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సిద్దిపేట మంగళవారం ఉదయం మనోచేతన రీహాబిలిటేషన్ సెంటర్, చేర్యాల లో ఆకస్మిక తనిఖీ మరియు లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అక్కడ హాస్టల్ లో భోజన నాణ్యత మరియు వంటగది పరిసారాలు, నిల్వ ఉన్న ఆహార పదార్ధాలని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్. స్వాతి రెడ్డి మాట్లాడుతూ ఈ సంస్థ కు ఏ అవసరం ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎప్పుడు సహకరిస్తుంది అని తెలియజేసారు. పిల్లలకు వైద్య సౌకర్యాలు ఎప్పటికి అప్పుడు అందజేయాలని అని తెలియజేసారు. అలాగే మానసిక అనారోగ్యం మరియు మేధో వైకల్యాలున్న వ్యక్తులను మనము వేరుగా చూడకూడదాని అందరిని సమానంగా చూడాలని చెప్పారు. అలాగే పిల్లలకు ఏ సమస్య ఉన్న తెలియజేయటానికి మా నుండి ఒక ప్యానెల్ అడ్వకేట్ మరియు ప్యారా లీగల్ వాలంటీర్ ని అప్పాయింట్ చేస్తామని తెలియజేసారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) వారు ఇల్లాంటి పిల్లల కోసం మనోన్యయ్ అనే న్యాయ సహాయ సేవ పెట్టారు అని చెప్పారు. ఇది మానసిక అనారోగ్యం మరియు మేధో వైకల్యాలున్న వ్యక్తులకు వారి హక్కులను రక్షించడంలో సహాయపడుతుంది అని తెలియజేసారు. ఈ కార్యక్రమములో కే. రమాదేవి మనోచేతన రీహాబిలిటేషన్ సెంటర్ చేర్యాల మరియు న్యాయసేవ సిబ్బంది పాల్గొన్నారు.





