
నేటిసాక్షి, మెట్ పల్లి : మెట్ పల్లి మండలము జగ్గసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు.అనంతరం గర్భిణి స్త్రీలతో వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేసుకోవాలని, సాధారణ ప్రసవాల వల్ల కలిగే లాభాలపై గ్రామాలలో అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఓపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.మందుల స్టోర్ రూమ్ పరిశీలించి స్టాక్ వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు.ల్యాబ్ ను పరిశీలించి టి హబ్ కు పంపిస్తున్న శాంపిల్, క్షయ వ్యాధి సంబంధిత కేసుల వివరాలను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు.ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిని సిబ్బందిని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు ఆత్మకూర్,వెలుల్ల లో జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాలను కార్యక్రమాన్ని పర్యవేక్షించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ అంజిత్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.