Monday, April 13, 2026

పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ..

నేటి సాక్షి, మునగాల
సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ మునగాల మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ను శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణపై సమీక్షించారు. అలాగే సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక నిఘా వేయాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ కు సూచించారు. బాల్య వివాహాలు, అసాంఘిక దురాచారాల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. లోన్ యాప్, సైబర్ మోసాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాలలోని పరిస్థితులను ఎస్సై, సి ఐ లను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సరిహద్దు గ్రామాలలో ప్రత్యేక నిఘా వేయాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా పని చేయాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో మోడల్ స్కూల్, ఆదర్శ పాఠశాల విద్యార్థులతో సమావేశమై ఈనెల 10వ తరగతి పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు, జామెంట్రీ బాక్స్, తదితర పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ రామకృష్ణారెడ్డి, ఎస్సై ప్రవీణ్ కుమార్, ఏ ఎస్ ఐ శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News