Wednesday, March 25, 2026

సీఎం పర్యటన సందర్భంగా హెలిప్యాడ్, పబ్లిక్ మీటింగ్ స్థలాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి మార్చి నెల 2న వనపర్తి జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ ,రావుల గిరిధర్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు.వనపర్తి జిల్లాకేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో హెలిప్యాడ్, బహిరంగ సభ, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో బాలుర పాఠశాల వివిధ కార్యాలయాలను మార్చి నెల 2వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపనలు మరియు పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలాకు వస్తున్న దృష్ట్యా వనపర్తి కేంద్రంలో హెలీప్యాడ్, పార్కింగ్, బారికేడింగ్,ఏర్పాట్లను శుక్రవారం రోజు ఉదయం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్,జిల్లా పోలీసు అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.సిఎం,పర్యటన సజావుగా జరిగేలా శాఖ పరంగా పటిష్ట భద్రత చర్యలు ఏర్పాటు చేయాలని సూచించారు.విఐపి , ప్రజా ప్రతినిధులకు వేరు వేరుగా పార్కింగ్ కు అనువైన స్థలాన్ని గుర్తించాలని తెలిపారు. బహిరంగ సభకు దూరంగా ప్రజా ప్రతినిధులు, అధికారులకు పార్కింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు.వాహనాల మూవ్మెంట్ సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని,అవసరమైన చోట బ్యారికేడ్ల నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని ప్రభత్వ శాఖలు పోలీస్ శాఖకు సహకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరావు, బిసిఆర్బి డిఎస్పీ, ఉపమామహేశ్వరరావు, వనపర్తి సీఐ, క్రిష్ణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు,అప్పలనాయుడు, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, సీసీ ఎస్ సీఐ, రవిపాల్, వనపర్తి పట్టణ ఎస్సై, హరిప్రసాద్, వనపర్తి రూరల్ ఎస్సై, జేలెండర్ రెడ్డి,గోపాల్ పేట్ ఎస్సై, నరేష్, చిన్నంబావి ఎస్సై, జగన్,ట్రాఫిక్ ఎస్సై, సురేందర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News