- జర్నలిస్టుల రాష్ట్ర మహాసభ ఛలో కరీంనగర్
నేటి సాక్షి,రామగిరి(కన్నూరి రాజు):
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లో జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి, జాతీయ కార్యదర్శి సబ్బితం లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు మోటపలుకుల. వెంకట్, రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కోల శ్రీనివాస్ పిలుపుమేరకు, మంగళవారం పెద్దపల్లి జిల్లా డిజేఎఫ్ ఉపాధ్యక్షులు కన్నూరి రాజు, జిల్లా కోశాధికారి పెయ్యల రమేష్, ఆధ్వర్యంలో రామగిరి మండలం లో మండల ఎమ్మార్వో, రామగిరి ఎస్ఐ చంద్రకుమార్, ఉమెన్ఎస్ఐ పి.దివ్య ఇరువురి చేతుల మీదుగా, డీజేఎఫ్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.జాతీయ కమిటీగా ఏర్పాటు అయినా డీజేఎఫ్ డెమొక్రటి జర్నలిస్టు ఫెడరేషన్ విలేకరుల హక్కుల కోసం విలేకరులకు ప్రభుత్వం నుండి రావలసిన ఉచిత విద్య, వైద్యం అనే నినాదంతో జనవరి 10వ తేదీ నాడు ఉద్యమాల పోరుగడ్డ మన కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న డిజేఎఫ్ సమావేశానికి జాతీయ, రాష్ట్ర వివిధ జిల్లాల విలేకరులు అధిక సంఖ్యలో సభ కు రావాలని, విలేకరుల హక్కుల కోసమే ప్రతి నిమిషం పోరాటం చేస్తున్నటువంటి డిజేఎఫ్ మహాసభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి వందలాదిగా వేలాదిగా డిజేఎఫ్ విలేఖరులు హక్కుల కోసం ప్రజా శ్రేయస్సు కోసం పోరాడే విలేకరులకు ఎంతైనా తమ హక్కుల కోసం పోరాడే సమయం ఆసన్నమైందన్నారు.ఈ కార్యక్రమంలో డిజేఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులు కనుక్కుట్ల రమేష్, రామగుండం మండల అధ్యక్షులు మామిడిస్వామి,మండల ప్రధానకార్యదర్శి కన్నూరి జెస్ కుమార్, బడికేల కృష్ణ పాల్గొని పిలుపునిచ్చారు.

