నేటి సాక్షి ప్రతినిధి గోదావరిఖని రమేష్ :
జిడికే 1&3 ఇంక్లైన్ నందు శ్రీ దుర్గాదేవి అమ్మవారి వార్షికోత్సవాల సందర్భంగా ఈ రోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఆర్జీ-1 ఏరియా జి.ఎం. శ్రీ లలిత్ కుమార్ మరియు సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనిత లలిత్ కుమార్ హాజరై అమ్మవారికి ప్రత్యెక పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ఉద్యోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ జిడికే 1&3 ఇంక్లైన్ నందు కొలువైన శ్రీ దుర్గాదేవి అమ్మ చల్లని దీవెనలతో అధికారులు అందరి మీదా కృప కటాక్షాలు ఉండాలని తెలిపారు. ఇదే స్ఫూర్తితో అందరూ కలిసికట్టుగా ఐక్యతగా ఉంటూ కలిసి పనిచేసే సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్క ఉద్యోగిపై ఉండాలని అదేవిధంగా సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను రక్షణతో సాధించాలని కోరారు. కార్యక్రమంలో ఏజంట్ 1 గ్రూఫ్ రమేష్, దాసరి వెంకటేశ్వర్ రావు, చంద్ర శేఖర్, నాగేశ్వర్ రావు, చిలక శ్రీనివాస్, ఏఐటీయుసి నాయకులు స్వామీ, మడ్డి ఎల్లయ్య, ఆరేళ్లి పోషం, డిజియం పర్సనల్, కిరణ్ బాబు, మేనేజర్ రమేష్,, పర్సనల్ అధికారులు రవీందర్ రెడ్డి, సారంగపాణి హనుమంత రావు,శ్రవణ్ కుమార్, ఇక్బాల్ షరీఫ్ అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.