Wednesday, March 25, 2026

నేతకాని మహార్ కులానికి న్యాయం చేయండి

  • ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ కు వినతి పత్రం

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో వెనుకబడిన నేతకాని మహార్ కులానికి న్యాయం చేయాలని నేతకాని మహార్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సునార్కార్ రాంబాబు కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్ ఆదేశాల మేరకు శుక్రవారం హైదరాబాద్ బూర్గుల రామకృష్ణారావు భవన్లో ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమీషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ, వర్గీకరణ గ్రూపులో 1,2,3 లకు బదులుగా ఏబిసిడి లు ఏర్పాటు చేసి, నేతకాని, మహార్ లను గ్రూప్ సి లో ఉంచి, మాల, మరికొన్ని అభివృద్ధి చెందిన కులాలను గ్రూప్ డి లో చేర్చాలని కోరారు. డాక్టర్ షమీమ్ అక్తర్ ప్రభుత్వానికి ఇచ్చిన వర్గీకరణ నివేదికలో మాలసాలే, నేతకాని లను గ్రూప్ 3లో చేర్చారని, మాలసాలే రాష్ట్రంలో లేదు అని, ఇది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో ఉంటుందన్నారు. నేతకాని కులస్తులు రాష్ట్రంలో 1,33,072 జనాభా కలిగి, మాల, మాదిగల తర్వాత మూడవ స్థానంలో అతిపెద్ద దళిత కులంగా నేతకాని కలం ఉందని తెలిపారు. అదేవిధంగా నేతకానీలు అసిఫాబాద్, కాగజ్ నగర్, ఆదిలాబాద్ ప్రాంతాలలో మహార్ లుగా 31,938 మంది కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉన్నారన్నారు, నేతకాని కులానికి ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలని కోరారు. గ్రూప్ బి లో ఉండి నాలుగో స్థానంలో 1,11,710 మంది జనాభా కలిగి ఉన్న బేడ, బుడుగ జంగాలను, మరికొన్ని కులాలను కలిపి 1,71,682 జనాభాతో గ్రూప్ 1గా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సామాజికంగా, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఏజెన్సీ ప్రాంతాలలో ఎలాంటి హక్కులు లేకుండా పేదరికంలో మగుతున్న నేతకానీ కులాన్ని, మరికొన్ని కులాలతో కలిపి గ్రూప్ సి లో ఉంచాలని కోరారు. అదేవిధంగా నేతకానీలు మెరుగైన ప్రయోజనాలు పొందేలా, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన మాల, ఇతర కులాల గ్రూప్ డి చేర్చి, అన్ని రకాల న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి గంగాధర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కామెర అనూష, రాష్ట్ర యువజన అధ్యక్షుడు అనపర్తి యువరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం సంతోష్, నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జుమ్మిడి గోపాల్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News