- డిప్యూటీ తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన బిఎస్పీ నేతలు
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్, మల్దకల్ ): మాదాసి మాదారి కురుమలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దని బహుజన్ సమాజ్ పార్టీ మల్దకల్ మండల ప్రధాన కార్యదర్శి రామ్ పోగు నరేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం మల్దకల్ మండల తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ ఝాన్సీరాణికి వినతి పత్రాన్ని సమర్పించారు. మండలంలో కొంతమంది మాదాసి మాదారి కురుమలు అక్రమంగా ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆమెకు విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మాదాసి మాదారి కురువలు లేరని ఆయన అన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కురుమలు ఎస్సీ కులద్రవీకరణ పొందడానికి అర్హులు కారని అన్నారు. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ప్రభుత్వ అధికారులు సైతం మాదాసి మా దారి కురుమలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దని సూచించారు.ఆయన వెంట వెంకటన్న, మద్దిలేటి, తిమ్మప్ప మరియు ఇతరులు ఉన్నారు.





