Monday, March 30, 2026

రంగాపూర్ గ్రామాన్ని హుజురాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేయవద్దు

  • బింగి కరుణాకర్ మాజీ సర్పంచ్ బిజెపి జిల్లా కార్యదర్శి

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు): హుజరాబాద్ మున్సిపాలిటీలో సమీప గ్రామాలు పెద్ద పాపయ్య పల్లె, రాంపూర్, రంగాపూర్ గ్రామాలను విలీనం చేయడానికి నిర్ణీత ప్రొఫార్మాలో గ్రామ జనాభా భౌగోళిక స్థితి దూరము తదితర వివరాలు ఇవ్వమని సిడిఎంఏ హైదరాబాద్ గారి లెటర్ బేస్ చేసుకొని హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఎంపీడీవో గారికి మరియు మూడు గ్రామాల పంచాయతీ సెక్రెటరీ లెటర్ పెట్టడం జరిగింది. కానీ హుజురాబాద్ మున్సిపాలిటీలో ఇప్పటికే విలీనమైన కొత్తపల్లె, ఇప్పల నర్సింగాపూర్, బోర్నపల్లి గ్రామాలలో ప్రజలు ఉపాధి హామీ పని లేక ఇంటి పన్నులు పెరిగి అభివృద్ధి జరగక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వం గారికి రంగాపూర్ గ్రామంలో సుమారు 483 జాబ్ కార్డులు ఉన్నాయని ఇందులో ప్రతి సంవత్సరం 15 లక్షల నుండి 20 లక్షల మేర కూలీలు డబ్బు తీసుకుంటున్నారని మరియు మెటీరియల్ పేమెంట్ ద్వారా ప్రతి సంవత్సరం 30 లక్షల రూపాయలు సిసి రోడ్లకు వివిధ అభివృద్ధి పనులకు ఉపాధి హామీ పనుల ద్వారా చెల్లించడం జరుగుతుంది. రంగాపూర్ రాంపూర్ పెద్దబాలపల్లె గ్రామాలు పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామాలు ఈ గ్రామాలలోని ప్రజలు కేవలం వ్యవసాయ కూలీ మాత్రమే చేయగలుగుతారు. విలీనం అయితే గ్రామ ప్రజలకు ఉపాధి కూలిపోయి చాలా కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. హుజురాబాద్ మున్సిపాలిటీలోని మెప్మా ద్వారా కుట్లు అల్లికలు నేర్పిస్తే ఈ గ్రామాల్లోని పేద ప్రజలు నేర్చుకోలేరు మరియు చేసిన పనిని ఎక్కడ అమ్ముకోలేరు. కాబట్టి మా యొక్క గ్రామాలను గ్రామపంచాయతీ ఉంచి మా యొక్క గ్రామ ప్రజలకు ఉపాధి కలిగేలా చూడాలని ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News