Friday, March 13, 2026

డాక్టర్స్ ఫర్ యు, బోయింగ్ ఇండియా ఆధ్వర్యంలో మంథనికి కొత్త అంబులెన్స్

నేటి సాక్షి,మంథని(పెయ్యల రమేష్):
మన మంథని ముద్దు బిడ్డ యజ్ఞంభట్ల ప్రవీణ రాజేశ్వర్, సిఎస్ఆర్ హెడ్ బోయింగ్ ఇండియా కృషి వలన రజత్ జైన్, ప్రెసిడెంట్, డాక్టర్స్ ఫర్ యు, బోయింగ్ ఇండియా వారి సహకారముతో శ్రీ సీతారామ సేవా సదన్–మంథనికి కొత్త అంబులెన్స్ వాహనమును యోగ దానము చేసినారు. ఆదివారం మన సీతారామ సేవా సదన్ వ్యవస్థాపకులు గట్టు నారాయణ గురూజీ ఈ కొత్త అంబులెన్స్ వాహనమును ప్రజలకు సేవ చేయుట కొరకు ప్రారంభించనైనది. ఇట్టి అంబులెన్స్ వాహనము యొక్క సేవలను ప్రజల సేవకు వినియోగించనున్నామని తెలుపటకు సంతోషము వ్యక్తము చేయుచున్నాము. రజత్ జైన్, ప్రెసిడెంట్, డాక్టర్స్ ఫర్ యు, బోయింగ్ ఇండియా యజ్ఞంభట్ల ప్రవీణ రాజేశ్వర్ కి సీతారామ సేవా సదన్ అధ్యక్షులు, సభ్యులు కృతజ్ఞతలు తెలిపినారు. ఇట్టి కార్యక్రమములో సదన్ అధ్యక్షులు కేవీఎలన్ హరిబాబు, ఉపాధ్యక్షులు కే. శ్రీనివాస్, కార్యదర్శి డి. గణపతి, సంయుక్త కార్యదర్శి పి. ప్రహ్లాద్, కోశాధికారి ఎస్. అంబరీష్ సభ్యులు సువర్ణ చంద్రశేఖర్ న్. హరి, అవధాని జ్యోతి, టి. రాధా కృష్ణ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News