Wednesday, March 11, 2026

ప్రజా పాలన అంటే ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడుల..?

  • బిఆర్ యస్ పార్టీ మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య..

నేటి సాక్షి ప్రతినిధి, చందుర్తి : ప్రజా పాలన అంటే ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడమేనా, 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఘన చరిత్ర ఇదేనా అంటూ చందుర్తి బిఆర్ యస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య ఘాటుగా విమర్శించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని మేకల ఎల్లయ్య తీవ్రంగా ఖండించారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రతిపక్షాలతో పాటు ప్రశ్నించే గుంతలపై భౌతిక దాడులు చేసే నూతన సంస్కృతికి బీజం వేసిందని మండిపడ్డారు. ఎన్నుకున్న ప్రజలతోపాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బిఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై, పార్టీ కార్యాలయాల పైన దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారని మండిపడ్డారు. గత పదేళ్లపాటు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం, నేడు అరాచకాలకు చిరునామాగా మారిందని, ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలని హితువు పలికారు. బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై తక్షణమే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ డప్పుల అశోక్, బిఆర్ యస్ పార్టీ నాయకులు బైరగోని రమేష్, చంటి బాబురావు, దుమ్మా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News