నేటి సాక్షి, (బాదూరు బాల) తిరుపతి : ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ వెబ్ సైట్ ను టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక డాలర్స్ గ్రూప్ కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో రాణించాలంటే ప్రాథమిక స్థాయిలో టెన్నిస్ బాల్ క్రికెట్ లోనే శిక్షణ ఉంటుందన్నారు. అంత ప్రాధాన్యత గల టెన్నిస్ బాల్ క్రికెట్ కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఔత్సాహికుల కోసం ప్రత్యేక వెబ్ సైట్ ను పొందించడం అభినందనీయమన్నారు. యువ క్రికెటర్లు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ సురేష్, జనరల్ సెక్రటరీ ఆర్ డి ప్రసాద్, జాయింట్ సెక్రెటరీ అజయ్ కుమార్, తిరుపతి జిల్లా సెక్రెటరీ మనోహర్, సభ్యులు పాల్గొన్నారు. వెబ్సైట్ https://www.aptbca.com