Tuesday, March 17, 2026

వసంత పంచమి సందర్భంగా పేదలకు వస్త్రదానం, అన్నదానం..!

  • మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ( కోక్కుల వంశీ ) : మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1382 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున లక్ష్మీగణపతి, రాజన్న మరియు భీమేశ్వర ఆలయాల వద్ద పేదలకు, అన్నార్తులకు అన్నదాన, వస్త్రదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలిపారు. సోమవారం అన్నదాతలుగా జగిత్యాల వాస్తవ్యులు నల్ల వసంత సతీష్ దంపతులు శాశ్వత దాతలుగా జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వరరావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు దేవరాజు ఉమ బాల చందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు, హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయికృష్ణ ఉన్నారని పేదల అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించాలనుకునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్టు ఫోన్ నం 92469 39388 ద్వారా సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, వొడ్యాల వేణు, పసుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News