నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : హైదరాబాద్ కు చెందిన భక్తుడు శ్రీ శ్రీనివాసులు రెడ్డి టిటిడి ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళాన్ని సోమవారం అందించారు. ఈ మేరకు డిడిని టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కి తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో అందించారు. గతంలో టీటీడీలోని వివిధ పథకాలకు సదరు దాత శ్రీనివాసులు రెడ్డి రూ. 30 లక్షలను విరాళంగా అందజేశారు. సోమవారం ఇచ్చిన రూ.10 లక్షలతో కలిపి మొత్తంగా శ్రీవారికి రూ. 40 లక్షలు అందించినట్లు అయింది. విరాళంగా అందించిన దాత శ్రీనివాసులు రెడ్డిని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అభినందించారు.
.





